: సచివాలయం ముందు బీఈడీ అభ్యర్ధుల ఆందోళన
బీఈడీ అభ్యర్ధులు సచివాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులకు బీఈడీ చేసిన వారిని కూడా అనుమతించాలని వారు డిమాండ్ చేసారు. సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్ధులు నినాదాలు చేసారు.
ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారిని కూడా 2015 వరకు అనుమతిస్తున్నామని మంత్రి శైలజానాథ్ మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. మరుసటి రోజే ఆయన ప్లేటు మార్చారు. ఇంకా అనుమతించలేదనీ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పరిశీలించాల్సి వుందని మంత్రి మరో ప్రకటన చేసారు. దీంతో బీఈడీ అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) చేసినవారే అర్హులు.