: క్రికెట్ మైదానం నుంచి వెండితెరకు వస్తున్న హర్భజన్ సింగ్
భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ త్వరలో వెండితెరపై కనిపించనున్నాడు. బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా రూపొందుతున్న ‘భాజీ ఇన్ ప్రాబ్లమ్’ అనే సినిమాలో భజ్జీ ఓ అతిథి పాత్రలో మెరవనున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు వెల్లడికానప్పటికీ, హర్భజన్ పాత్ర ఆసక్తికరంగా వుంటుందని తెలుస్తోంది. గ్రాజింగ్ గోట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాణంలో అక్షయ్ కుమార్ కూడా భాగస్వామి. 'ఐపీఎల్ 6' కంటే ముందే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. నిర్మాత అశ్శిన్ యార్డి మాట్లాడుతూ, భజ్జీ క్యారెక్టర్ అభిమానులను తప్పక అలరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.