: సులభ్ ప్రాజెక్టుకు ప్రపంచ గుర్తింపు
సులభ్ ప్రాజెక్టు ప్రపంచ వ్యాప్తంగా పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ప్రాజెక్టు రూపశిల్పి, ప్రముఖ పర్యావరణవేత్త బిందేశ్వర్ పాఠక్‌ను ప్రపంచమంతా ప్రశంసిస్తోంది. భారతదేశంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం పెంచేందుకు బిందేశ్వర్ విశేష కృషి చేసిన వ్యక్తిగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సులభ్ కాంప్లెక్స్ పేరుతో ఆయన దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల విప్లవానికి నాంది పలికారు.
పర్యావరణానికి, పారిశుద్ధ్యానికి బిందేశ్వర్ చేసిన కృషికి గుర్తింపుగా ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనకు 'లెజెండ్ ఆఫ్ ప్లానెట్' అవార్డును ప్రకటించింది. మంగళవారం రాత్రి పారిస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనెట్ ఉపాధ్యక్షురాలు చంటల్ జోర్డాన్ ఆయనకు ఈ అవార్డును అందజేసింది.