: తేలికైన కొత్తగ్రహం గుర్తింపు


ఇప్పటి వరకూ కనుగొన్న గ్రహాల్లో అత్యంత తేలికైన గ్రహాన్ని యూరోపియన్‌ అబ్జర్వేటరీ టెలీస్కోపు చిత్రీకరించింది. ఈ గ్రహం మన భూమి నుండి సూర్యుడికి ఉన్న దూరానికి సుమారు 56 రెట్ల దూరంలో, 300 కాంతి సంవత్సరాలకు అవతల హెచ్‌డి 95086 అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. మన సౌరకుటుంబానికి అవతల ఉన్న గ్రహాలను, అవి వాటికి సంబంధించిన నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నపుడు (ట్రాన్సిట్‌ పద్ధతి)గానీ లేదా రేడియల్‌ వెలాసిటీ పద్ధతి ద్వారాగానీ గుర్తిస్తారు.

కాగా ఈ కొత్త గ్రహంతో కలిపి ఇలా నేరుగా ఇప్పటికి 12 గ్రహాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకూ సౌరకుటుంబం అవతల గుర్తించిన గ్రహాల్లో ఇదే అత్యంత తేలికైన గ్రహమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హెచ్‌డీ 95086బి గా పిలుస్తున్న ఈ గ్రహం ద్రవ్యరాశి మన సౌరకుటుంబంలోనే అత్యంత బరువైన గురుగ్రహం కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తల అంచనా.

  • Loading...

More Telugu News