: తుపాను కారణంగా దిగిన సోలార్‌ ఇంపల్స్‌


సుమారు 21 గంటల పాటు గగనవిహారం చేసిన సోలార్‌ ఇంపల్స్‌ తుపాను గాలుల కారణంగా అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో దిగింది. సోలార్‌ ఇంపల్స్‌లో ఒక్క పైలట్‌కు మాత్రమే చోటు ఉంటుంది. ఇందులోని పైలట్‌ బెర్ట్రాండ్‌ పిక్కార్డ్‌ మాట్లాడుతూ, బలమైన తుపాను గాలుల కారణంగా విమానాన్ని సురక్షితంగా దింపడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. క్షేమంగా కిందికి దిగిన తనకు మరో ప్రపంచం నుండి వచ్చినట్టుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తుపాను గాలుల కారణంగా ఇంపల్స్‌ ఎయిర్‌పోర్ట్‌ హ్యాంగర్‌ పనిచేయకుండా పోయింది. దీనితో భారీ బుడగ లాంటి మొబైల్‌ హ్యాంగర్‌ను ఉపయోగించి ఇంపల్స్‌ను విమానాశ్రయంలో దించారు. విమానం నడవడానికి అవసరమైన ఎలాంటి శిలాజ ఇంధనాలను ఉపయోగించకుండా కేవలం సౌరశక్తితో మాత్రమే నడిచే విధంగా ఈ విమానాన్ని రూపొందించారు. ఇందుకుగాను అవసరమైన సుమారు 63 మీటర్ల పొడవైన రెక్కల్ని దీనికి అమర్చారు. 2015 నాటికి ప్రపంచం మొత్తాన్ని దీనిపై చుట్టి రావాలన్నది లక్ష్యం. మే నెల 3న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుండి ఫోనిక్స్‌ వరకూ ఇంపల్స్‌ను పిక్కార్డ్‌ నడిపారు.

  • Loading...

More Telugu News