: త్వరలో రానున్న 'అతడు, ఆమె, ఓ స్కూటర్'


వినోదాత్మక చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుంది. ఈ సినీ సూత్రాన్ని అనుసరించి తాజాగా మరో ఎంటర్ టైనర్ రూపుదిద్దుకుంది. వెన్నెల కిశోర్, ప్రియాంక చాబ్రియా జంటగా వస్తోన్న ఈ సినిమా పేరు 'అతడు, ఆమె, ఓ స్కూటర్'. పేరులోనే విభిన్నతను వ్యక్తం చేస్తోన్న తమ చిత్రం హిట్ కావడం ఖాయమని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గంగారపు లక్ష్మణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పిరమిడ్ క్రియేషన్స్ పతాకంపై అమరేంద్ర నిర్మించారు. పాటలు ఆకట్టుకుంటున్నాయని, త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి నెలాఖరులోగా సినిమాను విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది.

  • Loading...

More Telugu News