: ధోనీపై పిటిషన్ ను విచారించనున్న కోర్టు
ఓ వాణిజ్య ప్రకటనలో మత విశ్వాసాలను కించపరిచాడంటూ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆంధ్రప్రదేశ్ లో దాఖలైన పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఓ నేషనల్ బిజినెస్ మ్యాగజైన్ ముఖచిత్రంపై ధోనీ భగవంతుడి అవతారంలో పలు వాణిజ్య ఉత్పత్తులను చేత పట్టుకుని దర్శనమివ్వడం వివాదాస్పదమైంది. ఈ ప్రకటన పట్ల ఆగ్రహించిన న్యాయవాది ఒకరు అనంతరపురం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.