: మద్య నియంత్రణను మేనిఫెస్టోలో పెడతాం: బాబు
తాజాగా గొలుసు మద్యం దుకాణాలను రద్దు చేయాలంటూ గొంతెత్తుతున్న చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో మద్యనియంత్రణ అంశాన్ని చేర్చుతామన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులైపారుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు, టీడీపీ అధికారంలోకి వస్తే మద్యం గొలుసు దుకాణాల రద్దుపై రెండో సంతకం చేస్తానన్నారు. మద్య పానం రాజకీయ సమస్య కాదని, అదొక సామాజిక దురాచారమని స్పష్టం చేసారు. గొలుసు దుకాణాల రద్దుపై ముఖ్యమంత్రి తన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. ఎన్నికలవేళ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ నోటిఫికేషన్ లో నిబంధన తీసుకురావాలని డిమాండ్ చేసారు.