: శ్రీశాంత్ కు ఎదురుదెబ్బ
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో పోలీస్ కస్టడీ ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్ కు నిరాశ తప్పలేదు. శ్రీశాంత్ బెయిల్ పిటిషన్ ను కోర్టు నేడు తోసిపుచ్చింది. అంతేగాకుండా, శ్రీశాంత్ తో పాటు చండీలా, అంకిత్ చవాన్ లకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం వారికి జూన్ 18 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కాగా, ఢిల్లీ పోలీసులు ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన క్రికెటర్లపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్ డ్ క్రైమ్ యాక్ట్ (ఎంసీఓసీఏ) చట్టాన్ని ప్రయోగించారు.