: ఆదిలాబాద్ కోర్టులో కూడా అక్బరుద్దీన్ కు ఊరట
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సభలో వివాదాస్పద ప్రసంగం చేసి జైలులో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు ఆదిలాబాద్ కోర్టులో ఊరట లభించింది. అక్బర్ బెయిల్ అభ్యర్థనను స్వీకరించిన ఆదిలాబాద్ అదనపు న్యాయమూర్తి వెంకటేశ్వర్ రెడ్డి, ఆయనకు మూడు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు.
పాస్ పోర్టు అప్పగించాలనీ, నిర్మల్ పట్టణంలో ప్రవేశించవద్దనీ, అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించవద్దనీ న్యాయస్థానం షరతులు విధించింది. ఒకవేళ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. ఇవాళ ఉదయమే నిజామాబాద్ కోర్టులో కూడా అక్బరుద్దీన్ కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే.