: ఏపీపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతి: కేటీఆర్
ఏపీపీఎస్సీ సీమాంధ్ర పక్షపాతిగా మారిపోయిందని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల విధానం అమలు చేయకుండా తెలంగాణ వారికి ప్రత్యేకంగా జోనల్ విధానం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తే ఎక్కువమంది ఉద్యోగాలు పొందే వీలుంటుందని తెలిపారు. సీమాంధ్ర పాలకులు ఆర్టికల్ 308 ప్రకారం నియామకం చేపట్టలేదు. ఇప్పటికైనా గతంలో జరిగిన తప్పులను వదిలేసి అటువంటి తప్పులు మరలా జరుగకుండా చూసుకోవాలని కోరారు. లేకపోతే పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అలాగే దళితులు టీఆర్ఎస్ ని నమ్మకపోతే వివేక్, కడియం, మందా పార్టీలో ఎలా చేరతారని ప్రశ్నించారు.