: తిరుమలలో డ్రెస్ కోడ్ భక్తులను వేధించడమే: యనమల
వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తూ టీటీడీ అమల్లోకి తెచ్చిన విధానంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భక్తులను వేధించడమేనన్నారు. భక్తులు వర్షంలో తడవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ చేపట్టిన దళిత గోవిందం కార్యక్రమం కోసం వెచ్చిస్తున్న నిధులకు సంబంధించి పారదర్శకత లేదన్నారు.