: జైలులో శ్రీశాంత్ డిమాండ్లు


అంతా తన చేతుల్లో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానక ప్రవర్తించిన శ్రీశాంత్, అంతా అయిపోయాక తెగ నిట్టూరుస్తున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి జైలు కెళ్లిన శ్రీశాంత్ కి భోజనం సయించట్లేదట. అక్కడి చపాతి, పప్పు, అన్నం అతను సరిగా తినడం లేదు. కనీసం నీళ్లు కూడా తాగడం లేదట. ఈ తిండి తనకు సయించట్లేదని, దీనివల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే తనకు జైలు క్యాంటీన్ నుంచి ఆహారం కావాలని, అలాగే మినరల్ వాటర్ అందజేయాలని డిమాండ్ చేస్తున్నాడట, దీంతో జైలు అధికారులు శ్రీశాంత్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాడని, ఇక్కడ అది లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడని అంటున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో రెండు సార్లు స్నానం చేస్తున్నాడని, రోజంతా ఐపీఎల్ న్యూస్ ఏం వస్తుందా? అని టీవీలో చూస్తున్నాడని ఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News