: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రోగులకో శుభవార్త


బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చిన రోగులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే వారి జీవనాన్ని మరికొంతకాలం పొడిగించుకోవచ్చు కాబట్టి. శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో బయటపడిన విషయం ఏమంటే రొమ్ము క్యాన్సర్‌ రోగులు వారు తీసుకునే 'టామోక్సిఫెన్‌' మందును ఐదేళ్లకు బదులుగా మరో ఐదేళ్ల పాటు పొడిగించి తీసుకుంటే వారి ఆయుర్ధాయం కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ మందును పదేళ్లపాటు తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వల్ల సంభవించే మరణాన్ని మరి కొంతకాలం పాటు నిలువరించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందు రొమ్ముక్యాన్సర్‌ ముఖచిత్రాన్నే మార్చేసిందని వారు తెలిపారు. గత 30 ఏళ్లలో ఈ వ్యాధి బారిన పడిన వారిలో 50 శాతం మంది మృత్యువాత పడకుండా ఈ మందు కాపాడిందని వైద్యులు తెలిపారు. అంటే రొమ్ము క్యాన్సర్‌ రోగుల పాలిట ఈ మందు సంజీవని లాంటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News