: ఛీర్ లీడర్స్ వద్దు, లేట్ నైట్ పార్టీలు రద్దు: బీసీసీఐ తాత్కాలిక ఛీఫ్
ఐపీఎల్ ను ప్రక్షాళన చేయాలంటే మొదట ఛీర్ లీడర్స్ సంస్కృతికి చరమగీతం పాడాలని, లేట్ నైట్ పార్టీలకు స్వస్తి చెప్పాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా అభిప్రాయపడ్డారు. అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు కావడంతో బీసీసీఐ చీఫ్ పదవికి ఎన్. శ్రీనివాసన్ తాత్కాలికంగా దూరమైన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో దాల్మియా బీసీసీఐ వర్కింగ్ గ్రూప్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. కోల్ కతాలో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో దాల్మియా మాట్లాడుతూ, క్రికెట్ కు అంటిన మకిలిని వదిలించేందుకు తాను చేయగలిగిందంతా చేస్తానని చెప్పారు.