: రఫెల్ నడాల్ లా పోజివ్వలేను: ధోనీ


స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ లా తాను ట్రోఫీతో పోజులివ్వలేనంటున్నాడు టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సీజన్ కు గాను ఐసీసీ బెస్ట్ వన్డే టీమ్ షీల్డ్ అందుకున్న అనంతరం ధోనీ మీడియాతో మాట్లాడాడు. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలిచిన అనంతరం నడాల్ షీల్డ్ ను కొరుకుతున్నట్టు పోజిస్తాడని, ధోనీ కూడా అలానే పోజివ్వాలని మీడియా ఫొటోగ్రాఫర్లు కోరారు. దీనికి ధోనీ స్పందిస్తూ, ఈ షీల్డ్ చాలా బరువుందని, కొరకడం కష్టమని చమత్కరించాడు. అయినా, తానేమీ నడాల్ నో, రోజర్ ఫెడరర్ నో కాదంటూ.. అది టెన్నిస్, ఇది క్రికెట్ అని పేర్కొన్నాడు.

కాగా, 2013 ఏప్రిల్ 1 నాటికి 119 పాయింట్లతో భారత జట్టు ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో, ధోనీ సేనకు కోటి రూపాయలు ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ లభించింది. ఇంగ్లండ్ లోని కార్డిఫ్ లో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్.. ధోనీకి షీల్డ్ బహూకరించారు. ఈ నెల 6న ఆరంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకుగాను టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. భారత్ జట్టు తన తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

  • Loading...

More Telugu News