: మాజీ మంత్రి బన్సల్ కు సీబీఐ నోటీసులు!


కేంద్ర మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఓ అధికారికి రైల్వే బోర్డులో స్థానం కల్పిస్తానంటూ మేనల్లుడు విజయ్ సింగ్లా ముడుపులు స్వీకరించడం బన్సల్ మెడకు చుట్టుకుంది. దీంతో, రైల్వే మంత్రి పదవి ఊడింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించేందుకు సీబీఐ సమాయత్తమవుతోంది. రైల్వే బోర్డులో నియామకాల విషయమై కేంద్ర దర్యాప్తు సంస్థ ఆయన్ను విచారించనుంది. ఎందుకంటే, ఈ బోర్డులో ఎవరిని నియమించాలన్నా రైల్వే మంత్రిదే తుది నిర్ణయం. కాగా, బన్సల్ నివాసంలోనే తాను లావాదేవీలు జరిపినట్టు సింగ్లా సీబీఐ విచారణలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News