: రాహుల్ గాంధీతో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల భేటీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, శాసన సభా పక్ష నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ రెండు రోజుల పాటు కొనసాగనుంది. పార్టీలోని నేతలంతా తమ వ్యక్తిగత విభేదాలను విడచి, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ కు వివరించారు.