: రాష్టాన్ని పలకరించిన రుతుపవనాలు
రుతుపవనాలు వచ్చేశాయి. మూడు నెలలపాటు మండిన రాష్ట్రాన్ని చల్లగా మార్చేందుకు, వర్షాలతో తడిపి ముద్ద చేసేందుకు ఋతుపవనాలు వచ్చేశాయి. ఏటా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈ సారి కాస్త ముందుగానే పలకరించాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు ఈ రోజు ఇవి విస్తరించాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.