: మావోయిస్టుల నరమేధంపై యూపీఏ రాజకీయం: రాజ్ నాథ్
యూపీఏ ప్రభుత్వ వ్యవహార శైలిపై బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గత నెల 25న మావోయిస్టులు సృష్టించిన నరమేధాన్ని యూపీఏ సర్కారు రాజకీయం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ కు విచ్చేసిన అనంతరం రాజ్ నాథ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయలో మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ సమస్యను శాంతిభద్రతల సమస్యగా పరిగణిస్తూ దానిని రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేస్తోందన్నారు. మావోయిస్టుల సమస్య పరిష్కారానికి యూపీఏ ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిష్కారం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాజ్ నాథ్ చెప్పారు. అన్ని రంగాలలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని, పాక్ సైనికులు మన జవాన్ల తలలు నరికి తీసుకెళ్లినా ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.