: రాజీనామా చేయమనే దమ్మెవరికుంది?
బీసీసీఐ వర్కింగ్ కమిటీ భేటీలో శ్రీనివాసన్ ను రాజీనామా చేయమని అడిగే సాహసం ఏ ఒక్కరూ చేయలేదని అనురాగ్ ఠాకుర్ తెలిపారు. ఛండీఘఢ్ లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అనురాగ్ ఠాకుర్ మాట్లాడుతూ, నిన్న జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం మీద పలు కామెట్లు చేసారు. శ్రీనివాసన్ మానసికంగా సిద్దమయ్యే సమావేశానికి వచ్చారని తెలిపారు. సమావేశంలో ఎవరూ శ్రీనివాసన్ ను రాజీనామా చెయ్యాలని కోరలేదని, ఆయనే ముందుగా దర్యాప్తు పూర్తయ్యే వరకూ రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు. అయితే ఆయన స్థానంలో సమర్ధుడైన వ్యక్తిని కూర్చో బెట్టాలని అభిలషించారు. దీంతో దాల్మియా పేరు ప్రతిపాదనలోకి వచ్చిందన్నారు. అనంతరం దాల్మియా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని, శ్రీనివాసన్ తప్పుకోవాల్సిన అవసరం లేదని తేల్చేశారని తెలిపారు.