: ఫ్లాష్‌ లేని ఫోటో!


కెమెరాతో ఫోటో తీయాలంటే ఫ్లాష్‌ కావాలి. ఫ్లాష్‌ లేకుండా చక్కటి ఫోటోలను తీయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఫోటో నాణ్యత తగ్గుతుంది. అయితే ఈ కొత్తరకం కెమెరాతో ఎలాంటి ఫ్లాష్‌ లేకుండానే నాణ్యమైన చక్కటి చిత్రాలను తీయవచ్చని చెబుతున్నారు సింగపూర్‌లోని నన్యాంగ్‌ టెక్నొలాజికల్‌ విశ్వవిద్యాలయం (ఎన్టీయూ)కి చెందిన శాస్త్రవేత్తలు.

ఈ శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సెన్సర్‌ని అభివృద్ధి చేశారు. ఈ సెన్సర్‌ సహాయంతో సాధారణ వెలుతురులో సైతం చక్కటి నాణ్యమైన చిత్రాలను తీయవచ్చని చెబుతున్నారు. ఈ సెన్సర్‌ను గ్రాఫీన్‌తో అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయాలను టెక్‌ న్యూస్‌ డైలీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News