: వచ్చే ఏడాది కల్లా మెట్రో కారిడార్ తొలి దశపూర్తి: మెట్రో రైల్ ఎండీ
మెట్రోరైల్ ప్రాజెక్టును 2017 చివరినాటికి పూర్తి చేసి తీరుతామని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎన్ రెడ్డి తెలిపారు. బేగంపేట నుంచి ఉప్పల్ వరకు జరుగుతున్న మెట్రోకారిడార్ పనులను పర్యవేక్షించారు. మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఉప్పల్ లో నిర్మిస్తున్న తొలి స్టేషన్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లర్లపై రెండు లైన్లలో పట్టాలను వేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి తొలి కారిడార్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు.