: ఒక్క రోజులో 57 మంది తాలిబాన్లు హతం
ఆఫ్ఘనిస్తాన్ లో సైన్యం, నాటో దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో గడచిన 24 గంటలలో 57 మంది తాలిబాన్లు హతమయ్యారని ఆఫ్ఘన్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. గజ్ని, హెల్ మాండ్, కపీసా, పక్తికా, పాక్టియా రాష్ట్రాల్లో రక్షణ దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ పసిగట్టిన మిలిటెంటు గ్రూపులు రాదారుల వెంట వాహనాలు పేల్చేసేందుకు మందు పాతరలను పెట్టాయి. వీటిని నిర్వీర్యం చేస్తూనే భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.