: త్వరలో ఆరు మహిళా బ్యాంకులు


మహిళా పోస్టాఫీసులు, మహిళా క్యాంటీన్లు, మహిళా ఆసుపత్రులను నిర్వహిస్తున్న ప్రభుత్వం కొత్తగా మహిళా బ్యాంకులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. 1000 కోట్ల రూపాయలతో మహిళా బ్యాంకును నిర్వహించేందుకు రిజర్వబ్యాంకు నుంచి అనుమతులు కోరినట్టు కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి రాజీవ్ ఠాకూర్ తెలిపారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈ బ్యాంకులను ఏర్పాటు చేయనున్నామని, వీటిలో పూర్తి సిబ్బంది మహిళలే ఉంటారని తెలిపారు. రిజర్వు బ్యాంకు నుంచి అనుమతులు పొందనున్న ఈ బ్యాంకులు నవంబరు నుంచి తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. ఈ బ్యాంకుల గురించి పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించే సమయంలోనే ఆర్ధిక మంత్రి ప్రకటించారని తెలిపారు.

  • Loading...

More Telugu News