: విజయవాడలో చేతన్ ఆనంద్ బ్యాడ్మెంటన్ అకాడమీ


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ విజయవాడలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేసారు. ఈ అకాడమీని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రారంభించారు. తను నేర్చుకున్న స్టేడియంలోనే అకాడమీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చేతన్ ఆనంద్ తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించనున్నట్టు చెప్పగా, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహ్మద్ ఆరిఫ్ ఈ అకాడమీకి ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారన్నారు. ఔత్సాహికులకు మెరుగైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ అకాడమీ పని చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News