: సంజయ్ దత్ కు బ్యాగుల తయారీ పని
పుణెలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్ దత్ కు అధికారులు కాగితపు బ్యాగుల తయారీ పని అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకు గాను ప్రారంభంలో రోజుకు రూ.25 కూలీగా అందిస్తారు. ఇందుకోసం ముందుగా అతడికి బ్యాగుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం సంజయ్ తన గదిలోనే బ్యాగులు తయారు చేయాల్సి ఉంటుంది. భద్రతా పరమైన కారణాల వల్ల సంజయ్ ను మిగతా ఖైదీలతో కలవకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.