: కాశ్మీర్ సరిహద్దుల్లో ముగ్గురు చొరబాటుదార్ల కాల్చివేత
దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాన్ని ఆర్మీ భగ్నం చేసింది. ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లా పాక్ సరిహద్దుల్లో గతరాత్రి భారత్ లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ దళాలు గుర్తించి కాల్పులు జరపగా ముగ్గురు మరణించారని సైనిక వర్గాలు వెల్లడించాయి.