: 48 గంటల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు
మరో 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు వెల్లడించింది. ఇక ఉపరితల అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడతాయని తెలిపింది.