: ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్న అన్నాహజారే


అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నాహాజారే మరోసారి ఆమరణ దీక్ష చేపట్టబోతున్నారు. లోక్ పాల్ బిల్లుకోసం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నానని అన్నా ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. "అవినీతి వల్లే దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. అయినా ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. కనుక అక్టోబర్ లో మరోసారి నిరాహార దీక్షకు కూర్చోవాలని నిర్ణయించాను. జన్ లోక్ పాల్ బిల్లు తీసుకొస్తానని ప్రభుత్వం ఇచ్చిన హామీతో గతంలో నేను నిరాహార దీక్షను విరమించాను. రెండు సంవత్సరాలు గడిచినా ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. ప్రభుత్వం నాకు, దేశానికి తప్పుడు హామీలు ఇచ్చింది" అని అన్నా లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News