: ప్రార్థనాలయంలో యువతిపై అత్యాచారం, హత్య
మహిళలపై దురాగతాలకు అడ్డుకట్టపడడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో నేరాలు, ఘోరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పవిత్ర ప్రార్థనాలయంలోనే యువతిపై కామాంధులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా థరూర్ మండల కేంద్రంలోని చర్చిలో ఇది జరిగింది. ఈ దారుణానికి బలైపోయిన యువతి యాలాల మండలం రాస్నం గ్రామస్థురాలిగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ ప్రారంభం అయ్యింది.