: ఈ ఆటతో షుగరు వ్యాధి అదుపు!


సహజంగా ఆటలు ఆడడం ఆరోగ్యానికి మంచిది అంటారు. అయితే ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆట ఆడడం వల్ల అది మరేదైనా వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉపకరిస్తుంది అంటే... ఫుట్‌బాల్‌ ఇలాంటి ఆటే అంటున్నారు పరిశోధకులు. డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కొపెన్‌హ్యాగెన్‌కు చెందిన శాస్త్రవేత్తలు మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజూ కొంతసేపు ఫుట్‌బాల్‌ ఆడడం వల్ల వ్యాధి అదుపులో ఉంటుందని తమ పరిశోధనల్లో గుర్తించారు.

రోజూ కొంత సమయం పాటు ఫుట్‌బాల్‌ ఆడడం వల్ల టైప్‌ 2 మధుమేహ రోగుల్లో గుండె పనితీరు మెరుగుపడి, రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు 37 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న 21 మంది రోగులకు ఫుట్‌బాల్‌ ఆటలో మూడు నెలల పాటు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ఈ ఆట ఆడుతున్న సమయంలో వారి హృదయం, దాని కండరాలు ముందుకంటే ఎంతో సరళంగాను, 29 శాతం వేగంగాను పనిచేశాయని ఈ అధ్యయన బృందంలోని డాక్టర్‌ జాకబ్‌ ఫ్రిన్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. అంటే మూడు నెలల పాటు ఈ ఆట ఆడినందుకే వీరి గుండె పదేళ్ల యుక్తప్రాయమైందని ఆయన అన్నారు. చాలమంది మధుమేహ రోగులకు గుండె సరిగా పనిచేయదని ఈ ఆట ఆడడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుందని ఆయన అంటున్నారు.

  • Loading...

More Telugu News