: పొగరాయుళ్లకు రష్యా ఝలక్
పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్ అన్నాడు మన గిరీశం. పాపం గిరీశం సంగతి తెలియని రష్యన్లను బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే భారీ జరిమానాతో బాదేస్తామంటున్నారు అక్కడి అధికారులు. విశేషమేంటంటే అక్కడ ప్రతి పదిమందిలో నలుగురు ధూమపాన ప్రియులే. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులను ఎక్కువగా వినియోగిస్తున్న నాలుగో దేశం కూడా రష్యానే. ధూమపానం వల్ల రష్యాలో నాలుగు లక్షలమంది ప్రతి ఏటా రోగాల బారిన పడుతున్నారు.
దీంతో అధ్యక్షుడు పుతిన్ ప్రజలను పొగాకు ఉత్పత్తుల వాడకానికి దూరంగా ఉంచాలని ఆశించి పొగాకు వ్యతిరేక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం బస్సులు, రైళ్లు, ఓడలు, ప్రయాణ ప్రాంగణాలు, లిఫ్టులు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పొగత్రాగడం నిషేదం. ఈ చట్టాన్ని మీరిన వారు 800 రూబుళ్ల నుంచి 2,800 రూబుళ్ల వరకూ జరిమానా కట్టాల్సిందే. మన దేశంలో కూడా ఈ చట్టం అమలులో ఉంది. కానీ మన అధికారుల పెద్ద మనసు వల్ల ఎక్కడా అమలు జరగడం లేదు.