: 'యే జవానీ హై దీవానీ' తొలి రోజు కలెక్షెన్ 19.45 కోట్లు
రణబీర్ కపూర్, దీపికా పదుకునే జంటగా నటించిన 'యే జవానీ హై దీవానీ' సినిమా భారీ వసుళ్ల దిశగా పరుగులు పెడుతోంది. నిన్న దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే మన దేశంలో 19.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కరణ్ జోహర్ నిర్మించిన ఈ సినిమాకి ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లో రణబీర్, దీపిక ల జోడీకి మంచి క్రేజ్ ఉంది. తాజా ఆదరణతో ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని సినీ పండితులంటున్నారు.