: కుటుంబాన్ని వెలివేస్తారా?: హెచ్ఆర్సీ
కరీంనగర్ జిల్లాలోని బండలింగంపల్లిలో కుటుంబాన్ని వెలివేసిన ఘటనను మానవహక్కుల సంఘం తీవ్రంగా తీసుకుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ, ఈ విషయంలో పోలీసులు కేసులు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. హక్కులు కల్పించడం పొలీసుల బాధ్యత అని చెబుతూ, సమాజంలో ఈ రకమైన వివక్ష ఇంకా కొనసాగడాన్ని తప్పుపట్టింది. కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.