: దొరికితే ఒదులుతామా?
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో కొద్ది రోజుల క్రిందట గ్రామంలోని రైతుల దగ్గర్నుంచి 40 లక్షల రూపాయల విలువ చేసే మొక్కజొన్నలు కొనుగోలు చేసాడు ఓ వ్యాపారి. అనంతరం వారికి డబ్బులు చెల్లించకుండా పరారయ్యాడు. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు లబోదిబో మన్నారు, గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో ఆ మోసకారి వ్యాపారి శనివారం గ్రామంలోకి మళ్లీ వచ్చాడు, దీంతో అతన్ని పట్టుకుని నిర్బంధించారు. తమకు న్యాయం జరిగే వరకూ వ్యాపారిని కదలనివ్వబోమని రైతులు ఆందోళన చేస్తున్నారు.