: జూన్ 14 న సిద్దార్ధ్, హన్సికల సంథింగ్ సంథింగ్


సిద్దార్థ్, హన్సిక జోడీగా నటిస్తున్న సంథింగ్ సంథింగ్ జూన్ 14న విడుదలకు సిద్దమౌతోంది. సుబ్రమణ్యం తమిళంలో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో శ్రీలక్ష్మీ గణపతి ఫిల్మ్స్ పతాకంపై విడుదల చేయనున్నారు. సి సుందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై సిద్దార్ధ్ కు చాల నమ్మకం ఉంది. తెలుగు హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దూకి తెలుగులో ఈ మధ్యకాలంలో పెద్దగా విజయాలు లేవు. దీంతో తెలుగు సినీరంగంలో లైమ్ లైట్ లో ఉండాలంటే సిద్దూకి ఈ సినిమా విజయం చాలా అవసరం. 'జర్నీ' మ్యూజిక్ డైరెక్టర్ సత్య ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాలో హీరో రానా అతిధి పాత్రలో అలరించనున్నారు. బ్రహ్మానందం కూడా నవ్వుల పువ్వులు పూయిస్తాడు.

  • Loading...

More Telugu News