: రేపు బీసీసీఐ అత్యవసర భేటీ.. అధ్యక్షుడి రాజీనామా?
అన్నివైపుల నుంచీ వచ్చిన ఒత్తిడికి బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తలొగ్గారు. రేపు బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది చెన్నైలో జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. స్పాట్ ఫిక్సింగ్ పై దర్యాప్తు పూర్తయ్యే వరకూ శ్రీనివాసన్ అధ్యక్ష పదవికి దూరంగా ఉండడం లేదా పూర్తిగా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రేపటి సమావేశం అనంతరం ముఖ్యమైన ప్రకటన వెలువడుతుందని రాజీవ్ శుక్లా చెప్పారు. అరుణ్ జైట్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి అవకాశాలున్నాయని తెలుస్తోంది.