: భారత సైన్యం చేతిలో పాక్ సైనికుడి హతం
నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలో ప్రవేశించిన పాకిస్తాన్ సైనికుడిని భారత సైన్యం కాల్చి చంపింది. జమ్ముకాశ్మీర్ లోని నౌషేరా సరిహద్దుకు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, మృతదేహాన్ని ఆప్పగించాలన్న పాక్ విజ్ఞప్తికి భారత్ సైన్యం సానుకూలంగా స్పందించింది. అంతకుముందు పాక్ సైన్యం ఓ ప్రకటనలో, తమ సైనికుడు గురువారం మధ్యాహ్నం దారితప్పి ఖోయ్ రత్తా సెక్టార్ వద్ద నియంత్రణ రేఖను దాటాడని పేర్కొంది.