: భారతీయులు ఆన్ లైన్లో అన్నీ షేరు చేసుకుంటారు!
భారతీయులలో అత్యధికులు ఆన్ లైన్లో సిగ్గుపడరు, మొహమాటం అసలే లేదు. భయం కూడా తెలియదు. తమ అభిప్రాయాలు, భావాలు నిర్మొహమాటం లేకుండా, దాచుకోకుండా చెప్పేయడం, ఫొటోలు, వీడియోలను అప్ డేట్ చేయడం ఇలా వ్యక్తిగత విషయాలను పంచేయడంలో భారతీయులు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో మతపరమైన ఆంక్షలతో నడిచే సౌదీ అరేబియా ఉండడం మరింత ఆశ్చర్యకరం. వెంచురా కేపిటల్ నిర్వహించిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఇక ఈ ఏడాదిలో స్మార్ట్ ఫోన్ల సంఖ్యలో భారత్ ఐదో స్థానానికి చేరుకుంటుందని ఈ అధ్యయనం తెలిపింది. ఏటేటా దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం 52 శాతం పెరుగుతోందట.