: గిరిజన డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు


ఇంతకుముందు వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్ ను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా గిరిజన డిక్లరేషన్ ను విడుదల చేశారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు గిరిజన కులాల అభివృద్ధి కోసం టీడీపీ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

లంబాడీలు, ఇతర గిరిజన కులాలకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామన్నారు. కాగా, నిన్న కొలకలూరులో సభావేదిక మెట్లు కూలి గాయపడిన చంద్రబాబు.. కాలు నొప్పి ఎక్కువగా ఉన్నప్పటికీ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే, వైద్యుల సూచన మేరకు ఇవాళ, రేపు రోజుకు 8 కిలోమీటర్లు మాత్రమే నడుస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. 


  • Loading...

More Telugu News