: రేపు కాంగ్రెస్ కోర్ కమిటీ కీలక భేటి
కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్ రేపు జరుగనుంది. రేపు అత్యవసరంగా భేటీ కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముందుగా పలు అంశాలపై సమగ్ర చర్చజరపనున్నారు. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పై మావోల దాడి మృతి సందర్బంగా ఏర్పడిన పరిస్థితులు, డిసెంబర్ 9 నాటి తెలంగాణ ప్రకటనను అసెంబ్లీ తీర్మానానికి పెట్టడం, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం ఫెయిలవ్వడానికి కారణాలను సమగ్రంగా చర్చించనున్నారు. కేంద్ర మంత్రుల రాజీనామాతో ఖాళీ అయిన కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. చర్చకు రానున్న ప్రధానాంశాలలో తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలా? లేక తెలంగాణ బోర్డు ఏర్పాటు చేయాలా? అని చర్చించనున్నారు. మరో వైపు అఖిలపక్షం సమావేశంలో ఓ రకంగా, రాష్ట్రంలో ఒకరకంగా చెబుతున్న పార్టీలని ఇబ్బంది పెట్టాలంటే అసెంబ్లీ తీర్మానం చెయ్యిద్దాం అంటూ కొత్త ప్రణాళిక తెచ్చారు.