: సోనియాతో ముగిసిన సీఎం సమావేశం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ఎంపీల రాజీనామాలు, మంత్రివర్గ మార్పులు, కళంకిత మంత్రులపై నిర్ణయం వంటి అన్ని విషయాలు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జ్ గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు.