: కాంగ్రెస్ ను వీడే ప్రసక్తేలేదు: రాజయ్య


తాను కాంగ్రెస్ ను వీడే ప్రసక్తేలేదని ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్పష్టం చేసారు. కాంగ్రెస్ లోనే ఉండి తెలంగాణ కోసం పోరాటం చేస్తానని తెలిపారు. తెలంగాణను ఇచ్చే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని చెప్పారు. తాను పార్టీ వీడుతానని వచ్చినవన్నీ పుకార్లేనని, తాను పార్టీ వీడాల్సిన అవసరం లేదని తెలిపారు. మిగిలినవారి గురించి ప్రస్తావించగా, వారి ఇష్టాన్ని మనం కాదనలేమన్నారు. అధిష్ఠానం తెలంగాణపై అనుకూలంగానే ఉందని, వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని గుర్తు చేసారు.

  • Loading...

More Telugu News