: చెత్తకుప్పలో తుపాకుల కలకలం
చెత్తకుప్పలో రెండు తుపాకులు కన్పించడంతో సికింద్రాబాద్ లో కలకలం రేగింది. పద్మారావు నగర్ గాంధీ ఆస్పత్రి వెనుక ఉన్న చెత్తకుప్పలో రెండు తుపాకులు పడి ఉన్న విషయం పోలీసులకు అందింది. దాంతో వారు అక్కడికి చేరుకుని రెండు 303 రకం తుపాకులను, 20 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరు వీటిని వదిలి వెళ్లారనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం స్థానికంగా కలకలం సృష్టించింది.