: స్పాట్ ఫిక్సింగ్ కు ఝలక్ ఇచ్చిన సిద్దార్థ్ త్రివేదీ
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో క్రికెటర్ సిద్దర్ధ్ త్రివేదీ ప్రాసిక్యూషన్ తరపున సాక్షిగా మారాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సిద్దార్ద్ త్రివేదీకి బుకీలు బంపరాఫర్ ఇచ్చారట. కానీ, త్రివేదీ అప్పనంగా వచ్చే అందలం నాకొద్దంటూ నిర్ధ్వందంగా తోసిపుచ్చాడు. ఫిక్సింగ్ నేపధ్యంలో పోలీసులు అతనిని సాక్ష్యమిచ్చేందుకు రమ్మనగా అందుకు అంగీకరించిన త్రివేదీ, కోర్టులో హాజరై సాక్ష్యమిచ్చాడు. ఫిక్సింగ్ వ్యవహారంలో అసలు బుకీలు ఆటగాళ్ళను ఎలా ఆకట్టుకుంటారు? ఎలాంటి ఆఫర్లు ఇస్తారు? ఆటగాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? అనే విషయాలన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు. త్రివేదీ సాక్ష్యం పోలీసుల విచారణకు మరింత బలాన్నిచ్చింది.