: సిలిండర్ బుక్ చేసిన నాలుగు రోజుల్లో సబ్సిడీ


జూన్ 1 నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, అనంతపూర్, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలలో గ్యాస్ సబ్సిడీనీ నగదు బదిలీ ద్వారా అందించనున్నారు. ఈ జిల్లాలలో ఆధార్ కార్డు నంబర్ ను గ్యాస్ డీలర్లు, బ్యాంకులకు సమర్పించినవారికి సిలిండర్ బుక్ చేసుకున్న నాలుగు రోజుల్లోపు వారి ఖాతాలలో సబ్సిడీ డబ్బు జమ అవుతుందని సమాచారం. తర్వాత మార్కెట్ రేటుకు సిలిండర్ కొనుగోలు చేయాలి. ఈ జిల్లాలలో ఇంకా ఆధార్ నంబర్ ను సమర్పించని వారికి ఆగస్టు చివరి వరకూ గడువిచ్చారు. అప్పటి వరకూ వారికి సబ్సిడీ రేటుకే సిలిండర్ ఇస్తారు. అప్పటికీ ఆధార్ నంబర్ ఇవ్వకపోతే వారిక మార్కెట్ రేటుకు సిలిండర్ కొనుక్కోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News