: పెయిన్ కిల్లర్లు కాదు.. హార్ట్ కిల్లర్లు


నొప్పి నుంచి ఉపశమనం కల్పించే రెండు రకాల పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను ఎక్కువగా వాడితే గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఇబూప్రోఫెన్, వివాక్స్ టాబ్లెట్లతో ఈ ప్రమాదం ఎక్కువని వారి అధ్యయనంలో తెలిసింది. వీటిని అదే పనిగా అధిక మోతాదులో వాడితే గుండెపోటు, పక్షవాతం బారినపడే ముప్పు అధికమవుతుందని తేల్చారు. కాగా, వివాక్స్ ను 10 ఏళ్ల క్రితమే మనదేశంలో నిషేధించారు. ఏమైనా, నాన్ స్టిరాయిడల్ నొప్పి నివారిణి మాత్రలను దీర్ఘకాలంపాటు వాడొద్దని పరిశోధకులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News