: క్రీడలను రాజకీయాలతో కలపకండి: ప్రధాని
క్రీడలను, రాజకీయాలను కలిపి చూడకండని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రెండూ వేర్వేరన్నారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ పై మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా ఆయనిలా స్పందించారు. విచారణ జరుగుతున్నందున దానిపై వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని చెప్పారు. మంత్రివర్గంలో ఖాళీలను భర్తీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.