: అండమాన్ దీవులకు అరుదైన గుర్తింపు
ప్రపంచ జీవావరణ నిధిగా అండమాన్ దీవులను యునెస్కో గుర్తించింది. దీనివల్ల అండమాన్ దీవులలో జీవావరణ పరిరక్షణకు యునెస్కో తనవంతు నిధుల సహకారం అందిస్తుంది. అండమాన్ తో పాటు మరో 11 ప్రాంతాలను జీవావరణ రక్షిత ప్రాంతాలుగా యునెస్కో తాజాగా తన జాబితాలో చేర్చింది. అండమాన్ దీవులు 1800 జంతువులు, అరుదైన గిరిజన జాతులకు ఆలవాలంగా ఉండడం వల్లే ఈ ప్రత్యేక గుర్తింపు లభించింది. దీంతో ఇలా గుర్తింపు పొందిన ప్రాంతాలు మనదేశంలో మొత్తం తొమ్మిదికి చేరాయి.